లాక్ డౌన్ అమలు తీరుతెన్నులపై సమీక్ష కోసం… హైదరాబాద్ కు కేంద్ర బృందం

| Edited By: Pardhasaradhi Peri

Apr 24, 2020 | 6:07 PM

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలు తీరు తెన్నులు, ఉల్లంఘనలు ఇతర అంశాలపై ఒక అంచనాకు వచ్చేందుకు మరి కొన్ని రాష్ట్రాలకు కేంద్ర బృందాలు రానున్నాయి. తెలంగాణాలో హైదరాబాద్, గుజరాత్ లో అహ్మదాబాద్, సూరత్, మహారాష్ట్రలో థానే, తమిళనాడులో చెన్నై నగరాలను ఈ బృందాలు సందర్శించనున్నాయి. మేజర్ హాట్ స్పాట్ జిల్లాలను కేంద్రం ఇదివరకే గుర్తించిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు అంతర్  రాష్ట్ర మంత్రివర్గ బృందాలను పంపుతున్నామని హోం శాఖ ట్వీట్ చేసింది. రాష్ట్ర అధికారులకు […]

లాక్ డౌన్ అమలు తీరుతెన్నులపై సమీక్ష కోసం... హైదరాబాద్ కు కేంద్ర బృందం
Follow us on

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలు తీరు తెన్నులు, ఉల్లంఘనలు ఇతర అంశాలపై ఒక అంచనాకు వచ్చేందుకు మరి కొన్ని రాష్ట్రాలకు కేంద్ర బృందాలు రానున్నాయి. తెలంగాణాలో హైదరాబాద్, గుజరాత్ లో అహ్మదాబాద్, సూరత్, మహారాష్ట్రలో థానే, తమిళనాడులో చెన్నై నగరాలను ఈ బృందాలు సందర్శించనున్నాయి. మేజర్ హాట్ స్పాట్ జిల్లాలను కేంద్రం ఇదివరకే గుర్తించిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు అంతర్  రాష్ట్ర మంత్రివర్గ బృందాలను పంపుతున్నామని హోం శాఖ ట్వీట్ చేసింది. రాష్ట్ర అధికారులకు వీరు తగిన ఆదేశాలు జారీ చేస్తారని, తమ నివేదికలను కేంద్రానికి సమర్పిస్తారని ఈ శాఖ పేర్కొంది. లాక్ డౌన్ అమలుతో బాటు నిత్యావసర వస్తువుల సరఫరా, సామాజిక దూరం పాటింపు నిబంధనలు, వైద్యులు, హెల్త్ వర్కర్ల భద్రత, పేదలకు, కూలీలకు సహాయ శిబిరాల ఏర్పాటు వంటి అన్ని అంశాలను ఈ బృందాలు పరిశీలించనున్నాయి. ఇటీవలే పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా కేంద్ర బృందాలను హోమ్ శాఖ పంపింది.