సముద్రంలోని నౌకల విషయంలో కేంద్ర రక్షణశాఖ కీలక ఆదేశాలు..!

| Edited By:

Apr 22, 2020 | 7:52 PM

కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్ వల్ల సముద్రంలోని వివిధ ప్రాంతాల్లోభారతదేశానికి చెందిన అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వీటన్నింటిని వెంటనే గోవా, ముంబై ఓడరేవులకు తరలించాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి శ్రీపాద్ వై నాయక్, విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, డిప్యూటీ మంత్రి మురళీధరన్‌లు కలిసి.. భారతదేశానికి చెందిన నౌకలను ఓడరేవులకు చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. భారత నౌకాశ్రయాల […]

సముద్రంలోని నౌకల విషయంలో కేంద్ర రక్షణశాఖ కీలక ఆదేశాలు..!
Follow us on

కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్ వల్ల సముద్రంలోని వివిధ ప్రాంతాల్లోభారతదేశానికి చెందిన అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వీటన్నింటిని వెంటనే గోవా, ముంబై ఓడరేవులకు తరలించాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి శ్రీపాద్ వై నాయక్, విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, డిప్యూటీ మంత్రి మురళీధరన్‌లు కలిసి.. భారతదేశానికి చెందిన నౌకలను ఓడరేవులకు చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు.. భారత నౌకాశ్రయాల సమీపంలోని ఓడల్లో చిక్కుకున్న సముద్రయాన ప్రయాణికులను ఓడరేవులకు తీసుకురావాలని తెలిపారు. అంతేకాదు.. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్రం నిర్ణయించింది. సముద్రంలో ఉన్న ఇండియన్‌ నేవీకి చెందిన నౌకలను, క్రూయిజ్‌లను గోవాకు తరలించి.. అందులోని ప్రయాణికులను, నేవీ స్టాఫ్‌ను క్వారంటైన్‌ చేయాలని పేర్కొంది.