కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు రూ. 50,000 నుంచి..కేంద్రం ఆర్థిక సాయం?

|

Jul 07, 2020 | 2:18 PM

దేశంలో కరనా విలయతాండవం చేస్తోంది. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు, చిన్నపిల్లలు, ముసలి వాళ్లు, ఆడ మగ అందరూ వైరస్ పంజా దాటికి వణికిపోతున్నారు. కరోనా కల్లోలంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారు.

కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు రూ. 50,000 నుంచి..కేంద్రం ఆర్థిక సాయం?
Follow us on

దేశంలో కరనా విలయతాండవం చేస్తోంది. రోజులు గడిచేకొద్దీ కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క‌రోనా అత్య‌ధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ ఇప్పుడు రష్యాను అధిగమించి, మూడో స్థానానికి చేరింది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్య, ధనిక అనే భేదాలు లేకుండా పట్టిపీడిస్తోంది. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు, చిన్నపిల్లలు, ముసలి వాళ్లు, ఆడ మగ అందరూ వైరస్ పంజా దాటికి వణికిపోతున్నారు. కరోనా కల్లోలంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారు.

మొన్న హైదరాబాద్‌లో ఓ జర్నలిస్ట్ కరోనా కారణంగా మృత్యువాత పడిన సంఘటన సంచలనం రేపింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో జర్నలిస్ట్ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి నాలుగో అంతస్తు నుండి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు ఆర్థిక సాయం ప్రకటించింది.

కోవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనా వైరస్ సోకిన జర్నలిస్టులకు రూ.50,000 నుంచి లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేయాలని సెంట్రల్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. కరోనా బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జి అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అందుకు సంబంధించిన ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. అలాగే కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని, దీనికి సంబంధించిన వివరాలను ఆ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పింది.

కరోనా బారినపడ్డ జర్నలిస్టులు సంప్రదించాల్సిన వెబ్‌సైట్:
http://pibaccreditation.nic.in/jws/default.aspx