వలస కార్మికుల తరలింపునకు బస్సులు కాదు.. రైళ్లు కావాలి.. రాష్ట్రాల అభ్యర్థన

| Edited By: Pardhasaradhi Peri

Apr 30, 2020 | 9:07 PM

లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుబడిపోయిన లక్షలాది  వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేస్తామన్న హోం శాఖ ప్రతిపాదనను పలు రాష్ట్రాలు సున్నితంగా తిరస్కరించాయి. అదిసాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పాయి. వీరంతా భారీ సంఖ్యలో ఉన్నారని, చాలా దూరం ప్రయాణించవలసి వస్తుందని, బస్సుల్లో అనేక రాష్ట్రాలు దాటి వీరు తమ సొంత జిల్లాలకు వెళ్లలేరని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు తమిళనాడు.. తమ రాష్ట్రంలో  నాలుగు లక్షల […]

వలస కార్మికుల తరలింపునకు బస్సులు కాదు.. రైళ్లు కావాలి.. రాష్ట్రాల అభ్యర్థన
Follow us on

లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుబడిపోయిన లక్షలాది  వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేస్తామన్న హోం శాఖ ప్రతిపాదనను పలు రాష్ట్రాలు సున్నితంగా తిరస్కరించాయి. అదిసాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పాయి. వీరంతా భారీ సంఖ్యలో ఉన్నారని, చాలా దూరం ప్రయాణించవలసి వస్తుందని, బస్సుల్లో అనేక రాష్ట్రాలు దాటి వీరు తమ సొంత జిల్లాలకు వెళ్లలేరని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు తమిళనాడు.. తమ రాష్ట్రంలో  నాలుగు లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని వారినందరినీ బస్సుల్లో ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. దీంతో ఇలాంటి రాష్ట్రాల విజ్ఞప్తిని మళ్ళీ పరిశీలించి రైళ్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.