బొంతు రామ్మోహన్ కు మ‌రోసారి క‌రోనా టెస్ట్‌..రిపోర్ట్స్‌…

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం మేయర్‌ డ్రైవర్‌ కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు జీహెఎంసీ సబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మేయర్‌ బొంతు రావ్మెూహన్‌కు

బొంతు రామ్మోహన్ కు మ‌రోసారి క‌రోనా టెస్ట్‌..రిపోర్ట్స్‌...

Updated on: Jun 13, 2020 | 6:21 PM

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నగర వాసులను కరోనా వైరస్‌ వణికిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం మేయర్‌ డ్రైవర్‌ కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు జీహెఎంసీ సబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మేయర్‌ బొంతు రావ్మెూహన్‌కు క‌రోనా పరీక్షలు నిర్వహించగా.. తాజాగా మరోసారి కరోనా టెస్ట్ చేశారు. శ‌నివారం వ‌చ్చిన రిపోర్ట్స్‌లో రామ్మోహ‌న్ కు మ‌రోసారి క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. త‌న డ్రైవ‌ర్‌కు ఇటీవ‌ల క‌రోనా రావ‌డంతో రామ్మోహ‌న్ రెండోసారి కరోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.. ఈ ప‌రీక్ష‌ల్లోనూ ఆయ‌న‌కు క‌రోనా నెగెటివ్ రావ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇటీవ‌ల న‌గ‌రంలోని ఓ హోట‌ల్‌లో మేయ‌ర్ టీ తాగ‌గా, ఆ హోట‌ల్‌లో ప‌నిచేస్తున్న వ్య‌క్తికి క‌రోనా తేలింది. దీంతో ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్ వ‌చ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ 100 నుంచి 175 దాకా కేసులు నవెూదవుతుండడంతో అందరిలోఆందోళన పెరుగుతోంది. తమ గల్లీలోనో, డివిజన్‌లోనో కరోనా వచ్చిందని తెలియగానే మరింత ఆందోళన చెందుతున్నారు.