“మహా’నిర్ణయం..వార్డుకు ఒక గణపతి విగ్రహమే

|

Jul 20, 2020 | 7:29 PM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు తీవ్రత కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలలో రోజురోజూకి రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీనితో ఇప్పటికే చాలా పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి.. ఇక త్వరలో గణేష్ చతుర్థి వస్తుండడంతో

మహానిర్ణయం..వార్డుకు ఒక గణపతి విగ్రహమే
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు తీవ్రత కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలలో రోజురోజూకి రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీనితో ఇప్పటికే చాలా పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి.. ఇక త్వరలో గణేష్ చతుర్థి వస్తుండడంతో మహారాష్ట్రలోని ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ కీల ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 22నుంచి గణేష్‌ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాగా, కరోనా వైరస్‌ నేప‌థ్యంలో ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ వార్డుకు ఒక గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని మాత్ర‌మే ప్ర‌తిష్టించాల‌ని సూచిస్తూ..ఆదేశాలు జారీ చేసింది. అంథేరి, జూహూ, వెర్‌సోవా లాంటి ప్రాంతాల్లో వార్డుకు ఒక వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని బీఎంసీ సూచించింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో తగు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పేర్కొన్న‌ది. అంధేరి వెస్ట్‌, జూహూ, వెర్సోవాలో చాలా వైభ‌వం గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు. అయితే అక్క‌డ గ‌ణ‌ప‌తి మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేసే వారికి అసిస్టెంట్ మున్సిప‌ల్ క‌మిష‌న్ విశ్వాస్ మోటే విజ్ఞప్తి చేశారు.

ఇకపోతే, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 10వేలను చేరగా.. ఒక్క ముంబైలోనే కోవిడ్ 19 కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. ఇందులో 23వేల యాక్టివ్‌ కేసులు ఉండగా.. 71 వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 5714 మంది వైరస్‌ వల్ల మరణించారు. ముంబై తర్వాత థానేలో 75వేల కేసులు, పూణేలో 54వేల కేసులు నమోదయ్యాయి. పాల్‌ఘర్‌, రాయ్‌ఘడ్‌లో కూడా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది.