జపాన్ ఆర్థిక వ్యవస్థపై కరోనా నీలినీడలు…బ్యాంక్ ఆఫ్ జపాన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

|

Apr 15, 2021 | 10:24 AM

Japan Economy - Bank Of Japan: జపాన్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ కోవిడ్ నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుప్తింపు పొందిన జపాన్...కరోనా వైరస్ ప్రభావంతో గత ఏడాది తీవ్ర ఒడిదుడుకులకు గురైయ్యింది.

జపాన్ ఆర్థిక వ్యవస్థపై కరోనా నీలినీడలు...బ్యాంక్ ఆఫ్ జపాన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Japan Economy
Follow us on

ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న జపాన్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ కోవిడ్ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్‌కు గుర్తింపు ఉంది.కరోనా వైరస్ ప్రభావంతో గత ఏడాది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురైయ్యింది. ఇప్పటిడిప్పుడే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కోవిడ్ సెకండ్ వేవ్ మళ్లీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ పశ్చిమ ప్రాంతమైన ఒసాకాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక అధికార యంత్రాంగం లాక్‌డౌన్ అమలుచేస్తోంది.

ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ హరుహికో కురోడా(Haruhiko Kuroda) ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ డిమాండ్ పెరగడంతో జపాన్ ఎకానమీ క్రమంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. అయితే కోవిడ్ భయాలు ఇంకా కొనసాగుతున్నందున…ఆర్థిక పురోగతి కనీస స్థాయిలోనే ఉండే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ జపాన్ రీజనల్ బ్రాంచ్ మేనేజర్ల సమావేశంలో ఆయన పేర్కొన్నారు.

పలు దేశాల్లో కోవిడ్ పరిస్థితులు జపాన్ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ ఆర్థిక వ్యవస్థపై కరోనా సెకండ్ తీవ్ర తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో నెలకొన్న జాప్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.