కరోనాపై యుద్ధానికి సిద్ధమైన బజాజ్.. రూ.100 కోట్లతో..

| Edited By: Pardhasaradhi Peri

Mar 27, 2020 | 7:50 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై యుద్ధం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. వివిధ వర్గాలను చెందిన ధనవంతులు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, కార్పోరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు పీఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్‌లకు విరాళాలిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి బజాజ్ కంపెనీ కూడా చేరింది. […]

కరోనాపై యుద్ధానికి సిద్ధమైన బజాజ్.. రూ.100 కోట్లతో..
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై యుద్ధం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. వివిధ వర్గాలను చెందిన ధనవంతులు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు,
కార్పోరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు పీఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్‌లకు విరాళాలిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి బజాజ్ కంపెనీ కూడా చేరింది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు రూ.100 కోట్ల నిధి సహాయాన్ని చేయనున్నట్లు బజాజ్ గ్రూప్ అధినేత రాహుల్ బజాజ్ ప్రకటించారు.

కరోనాను ఎదుర్కొవడానికి కావాల్సిన హెల్త్ కిట్స్.. ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఈ నిధిని ఉపయోగించనున్నట్లు తెలిపారు. అంతేకాదు.. కార్మికులు, ఇల్లు లేనివారు, వీధి పిల్లలకు వారికి కావాల్సిన తక్షణ సహాయం చేయనున్నట్లు తెలిపారు. వారికి కావాల్సిన ఆహారంతో పాటు..ఇళ్లు లేని వారికి షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏడు వందలు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో..