కరోనా ‘కొరొనిల్’…ఆన్ లైన్ లో ట్రెండింగ్ .. మీమ్ ల జోరు

యోగ గురు బాబా రాందేవ్ కరోనా రోగుల చికిత్సకు దివ్య ఔషధమంటూ ‘కొరొనిల్’ పేరిట మంగళవారం ఓ ఆయుర్వేద ఔషదాన్ని విడుదల చేశారు. ఈ మందు సుమారు 14 రోజుల్లో కరోనాను దూరం చేస్తుందని ప్రకటించారు. ఈ కిట్ ఆన్ లైన్ లో 545 రూపాయలకు లభ్యమవుతుందని, దేశం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి ఔషధం వచ్ఛేసిందని కూడా అన్నారు. అణు తెల్, అశ్వ గంధ, శ్వాసరీ మూలికలతో  తయారు చేసిన ఈ కొరొనిల్ ని […]

కరోనా కొరొనిల్...ఆన్ లైన్ లో ట్రెండింగ్ .. మీమ్ ల జోరు

Edited By:

Updated on: Jun 23, 2020 | 8:29 PM

యోగ గురు బాబా రాందేవ్ కరోనా రోగుల చికిత్సకు దివ్య ఔషధమంటూ ‘కొరొనిల్’ పేరిట మంగళవారం ఓ ఆయుర్వేద ఔషదాన్ని విడుదల చేశారు. ఈ మందు సుమారు 14 రోజుల్లో కరోనాను దూరం చేస్తుందని ప్రకటించారు. ఈ కిట్ ఆన్ లైన్ లో 545 రూపాయలకు లభ్యమవుతుందని, దేశం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి ఔషధం వచ్ఛేసిందని కూడా అన్నారు. అణు తెల్, అశ్వ గంధ, శ్వాసరీ మూలికలతో  తయారు చేసిన ఈ కొరొనిల్ ని ఎక్కడ తయారు చేశామన్నది వివరించారు. అయితే ఈ ఔషధానికి శాస్త్రీయత ఉందా అని కేంద్ర ఆయుర్వేద శాఖ ప్రకటించింది. దీని మార్కెటింగ్ పై పరోక్షంగా ఆంక్షలు విధించింది. కాగా-ఈ మందుపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా మీమ్ లు పెడుతూ కామెంట్లు చేశారు. కరోనా వైరస్ అదుపునకు అవసరమైన వాక్సీన్ తయారీకి ఎలా లేదన్నా ఆరు నెలల నుంచి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలమే పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని, అలాంటిది మీరు ఇంత తక్కువ కాలంలో ఎలా తయారు చేయగలిగారని వారు ప్రశ్నించారు. ఇంకా వివిధ రకాలుగా స్పందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us