Ayurvedic for Corona: ఆయుర్వేదంతో కరోనాకు చెక్.. అడ్డ సరం మొక్కతో తాజా ప్రయోగాలలో కీలక ముందడుగు

|

Apr 19, 2021 | 5:06 PM

క‌రోనా. ఈ పేరు చెబితేనే వణికిపోతున్నారు జనాలు. అంతగా కరోనా వైరస్ ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడా వైర‌స్ నివార‌ణ‌ మందు కనుక్కునేందుకు అనేక ప‌రిశోధ‌న‌లు జరుగుతున్నాయి.

Ayurvedic for Corona: ఆయుర్వేదంతో కరోనాకు చెక్.. అడ్డ సరం మొక్కతో తాజా ప్రయోగాలలో కీలక ముందడుగు
Follow us on

Ayurvedic check to coronavirus latest developments: క‌రోనా. ఈ పేరు చెబితేనే వణికిపోతున్నారు జనాలు. అంతగా కరోనా వైరస్ ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడా వైర‌స్ నివార‌ణ‌ మందు కనుక్కునేందుకు అనేక ప‌రిశోధ‌న‌లు జరుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల టీకాలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ టీకాల‌కు తోడుగా ఓ మందును అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి ప్రారంభించారు. అది ఫలితాలిస్తుందా లేదా అనే సంగతి పక్కన పెడితే దాని మూలాలు మాత్రం ఆయుర్వేదంతో ముడిపడి ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అడ్డ సరం మొక్క….

పొలం గ‌ట్ల వ‌ద్ద పెరిగే అడ్డ స‌రం మొక్క పై దృష్టి సారించారు మన శాస్త్రవేత్తలు. అది కరోనా నివారిణిగా పనిచేస్తుందని చెప్పడమే ఇందుకు కారణం. అదొక్కటే కాదు మన పెరటిలో దొరికే తులసి, వేపాకు, మామిడి, అశ్వగంధ, విప్పతీగ, నేలవేము, నేరేడు, మారేడు, అరటి వేళ్లు, అలోవీరా వంచి మొక్కల పైనా పరిశోధన జరుగుతుందిప్పుడు. క‌రోనా వైర‌స్‌పై ఈ మొక్కలు ఏ మేర‌కు ప‌ని చేస్తాయనే విష‌యంపై ఢిల్లీలోని ఆయుర్వేద‌, రెస్పిరేట‌రీ రీసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ అప్ల‌య్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వంటి జాతీయ సంస్థ‌లు సంయుక్తంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. ఇందులో ఇప్పుడు వారి దృష్టి అడ్డసరం పై పడింది. ఈ మొక్క కరోనా నివారణ విషయంలో సానుకూల ఫ‌లితాలు ఇవ్వ‌డంతో ఆశ‌ల‌ను రేకెత్తిస్తోంది.

కరోనా వైరస్ వచ్చిన రోగిలోని ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయిలు త‌గ్గుతోంది. అందులోను ర‌క్త గ‌డ్డ క‌ట్ట‌డం, ఊపిరితిత్తులోని క‌ణ‌జాలం దెబ్బ‌తిన‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొన‌డం మనం చూస్తున్నాం. అయితే ఈ మూడు వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర్చ‌డంలో అడ్డ‌స‌రం మొక్క బాగా ప్రయోజనకారి అని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందట. మేలు చేసే జన్యువులకు సహాయపడే గుణాలు అడ్డసరం మూలికలలో బాగా ఉన్నాయని వారి అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం పత్రం తాజాగా రెస్పిరేటరీ రీసెర్చ్‌ పబ్లికేషన్‌లో వచ్చింది. అంతే అంతటా దీని పై చర్చ సాగుతోంది. టీకా చేయలేని పని ఈ అడ్డరసం చేస్తుందంటున్నారు.

అడ్డ‌స‌రం మొక్క ఔషధంగా ఇప్పటికే విరివిగా వాడుతున్నారు మన ఆయుర్వేద వైద్యులు. ఇప్పుడు ఈ మొక్కగా ప్రాధాన్యం పెరింది. ఈ మొక్క ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును మందుల తయారీలో విరివిగా వాడుతున్నారు. జలుబు, దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం నివారణ, చర్మవ్యాధుల చికిత్సలోనూ అడ్డసరం మొక్క వినియోగిస్తారు. అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్తస్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడడమే కాదు…విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడీ పరిశోధనలు మరింతగా ఫలిస్తే అందరికీ మేలు జరుగుతుందంటున్నారు.

కరోనాకు ఆయుర్వేదంతో చెక్

ఆయుర్వేదంతో కూడ కరోనా తగ్గుతోందని చెబుతున్నారు పరిశోధకులు. విప్పతీగ వంటి ఔషధ మొక్కతో కరోనా బూస్ట్ తయారు చేసింది ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా బృందం. ఇంగ్లీష్ మందులు చేయలేని పని ఆయుర్వేదం చేస్తోందని ప్రచారం చేశారు వాళ్లు. అదే కాదు..చాలా రకాల ఆయుర్వేద మందులు కరోనా తగ్గిస్తున్నాయని చెబుతున్నారు. నేను కరోనాను తగ్గిస్తానని ఒంగోలుకు చెందిన సుందరరామయ్య అనే బయో సైంటిస్ట్ బాహాటంగానే చాలెంజ్ విసిరాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వంటి చాలా మంది ప్రముఖులను కలిసి తాను కనుక్కున్న ఆయుర్వేదం మందు గురించి ప్రస్తావించాడు. వందల మందికి ఆ మందును సరఫరా చేశాడు. నేను వంద శాతం కరోనాను తగ్గిస్తానని వరంగల్ కు చెందిన మరో ఆయుర్వేద నిపుణుడు మీడియా ముందే కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించాడు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ నే ఇందుకు సాక్ష్యం అన్నాడు. చుట్టు పక్కల చాలా మంది ఆ ఆయుర్వేద మందును తీసుకెళ్లి వాడారు. కరోనా నుంచి బయటపడ్డామని చెబుతున్నారు. ఆయుర్వేద మందుకే కరోనా తగ్గిందా లేక మరోదైనా కారణముందా అనే విషయంలో శాస్త్రీయత లేదు. ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన సారాన్ని ఆకలింపు చేసుకుని వీటిని తయారు చేశారు.

ఇమ్యూనిటీ బూస్ట్ ద్వారా కరోనాను జయించవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. కరోనా గురించి వశిష్ట మహర్షి శ్రీరాముడికి చెప్పాడని ప్రతీతి. సముద్రాన్ని చిలికి దేవతలు అమృతం తయారు చేశారని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. చంద్రుని అంశ సముద్రం నుంచి పుట్టిందట. అందుకే సముద్రంలో మానవ మనుగడకు అవసరమైన అమృతధార ఉంటుందని నానుడి. అక్కడ నుంచి తీసుకున్న నీటి ద్వారా ఆయుర్వేద మందు తయారు చేస్తున్నారు కొందరు ఆయుర్వేద నిపుణులు. అందుకే తాను కనుక్కున్న మాగ్నిటిక్ ఎలక్ర్టో ప్లూయెడ్స్ కు అమృత ధార అని పేరు పెట్టారు సుందర్ అనే బయో సైటిస్ట్. అశ్వగంధి, విప్పతీగ వంటి వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద వాడటం ద్వారా కరోనాను జయించవచ్చని ప్రముఖ యోగ గురువు రాం దేవ్ బాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మందును మార్కెట్లోకి విడుదల చేశారు. కాకపోతే కరోనా తగ్గిస్తుందని చెప్పడం వల్ల కేంద్ర ఆయుష్ శాఖ ఇందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా దాన్ని పేరును, పని చేసే గుణాన్ని మార్చాల్సి వచ్చింది. అదిప్పుడు ఇమ్యూనిటీ బూస్ట్ గా మారింది. అయినా కరోనా నియంత్రణకు ఆ ఆయుర్వేదాన్ని విరివిగానే వాడుతున్నారు.

ఎలా పని చేస్తోందంటే.. ?

కరోనా వల్ల మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తోంది. శరీరంలోని అన్ని భాగాలకు అది వ్యాపిస్తోంది. ముక్కు, నోరు, కళ్ల ద్వారా అది మానవ శరీరంలోకి ప్రవేశిస్తోంది. కొద్ది రోజుల పాటు ముక్కు, గొంతు భాగంలో ఉంటూ శరీరం పై దాడి చేస్తోంది. మానవ శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ను బట్టి అది దాడి చేసే తీరు ఆధారపడి ఉంది. శరీరంలో బాగా వీక్ గా ఉండే పార్ట్ ల పై అది బలమైన ప్రభావం చూపుతోంది. త్వరగా వాటిని నాశనం చేస్తోంది. అది రోజుల వ్యవధిలోనే తన పని కానిస్తోంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే సరే. లేకపోతే మనిని మట్టుపెట్టేంత వరకు ఊరుకోవడం లేదు. శ్వాస పై దాని ప్రభావం చూపి చంపేస్తోంది.

సెకండ్ వేవ్…

కరోనా వైరస్ గుండె, కిడ్నీలు, లివర్ వంటి భాగాల పైనా ప్రభావం చూపుతోంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఊపిరి సల్పనీయక పోవడం, నీరసంగా ఉండటం, వొళ్లు నెప్పులు రావడం వంటి లక్షణాలను కలిగిస్తోంది. మరికొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే వస్తోంది. తగ్గుతోంది. ఇంకొందరికి లక్షణాలు లేకుండానే మృత్యు కుహరంలోకి తీసుకెళుతోంది. ఏపీలోనైతే టెస్ట్ లు చేయించుకున్న వారిలో 20 మందికి కరోనా వైరస్ బయటపడుతోంది. ఫలితంగా అంతా నిర్ఘాంత పోతున్నారు. గత నాలుగు రోజుల్లో రోజుకు భారత్ లో 2 లక్షలకు తక్కువ కాకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాకు నివారణగా ఆయుర్వేదంతో తయారు చేసిన మందును వాడుతున్నారు చాలా మంది. వేడి నీళ్లు తాగుతున్నారు. పసుపు, తెనే కలుపుకుని నీరు సేవిస్తున్నారు. ఇందుకు నిమ్మకాయను జమ చేస్తున్నారు. భయంకరమైన ఆ వైరస్ ను శరీరం నుంచి బయటకు పంపుతున్నారు. శరీరంలోని డిఎన్ఏ, ఆర్ ఎన్ ఏ కణాన్ని పునర్ నిర్మించడం ద్వారా వైరస్ ను నిర్మూలించే పని చేస్తోంది మందు.

అమృత ధార ఆయుర్వేద మందులో చాలా విశేష గుణాలున్నాయి. ఒకటి నోటితో తాగే మినరల్ వాటర్. రెండోది ఆయిల్ కలిగిన మందు. నోట్లో పోసుకునే వాటర్ ను 15 నిమిషాల పాటు పుక్కిలిస్తున్నారు. తద్వారా లాలా జలంలోని సెల్యూలైజ్ తో అది జత కలుస్తోంది. మెల్లగా ఆ మెడికేటెడ్ వాటర్ ను మింగుతున్నారు. అలా మింగడం వల్ల శరీరంలోని హానికారక వైరస్ ను నిర్మూలిస్తోంది. ఇది మూడు నుంచి ఐదురోజుల్లోనే తన పనితీరును మెరుగుపరుస్తోంది. ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా వైరస్ ను ఎదుర్కోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మందు వాడకం ద్వారా వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతోంది.

ఇక రెండోది శక్తి నిచ్చే ఆయిల్. మనకు తెలిసిన ఆయుర్వేద ఔషధ వనమూలికలతో వీటిని తయారు చేస్తున్నారు. తులసి, వేపాకు, మామిడి, అశ్వగంధ, విప్పతీగ, నేలవేము, నేరేడు, మారేడు, అరటి వేళ్లు, అలోవీరా వంటి 72 రకాలను ఇందుకు ఉపయోగిస్తున్నారు. నువ్వుల నూనె, కానుగ నూనె, పొద్దు తిరుగుడు నూనె, కొబ్బరినూనె,ఆవ నూనె, నిమ్మనూనె వంటి వాటి మిశ్రమంతో ఇవి తయారవుతున్నాయి. హైడ్రో కార్భన్ నుంచి నూనెను తీస్తే అవి ప్యాటీ యాసిడ్స్ గా మారతాయి. వాటిని మూడు, నాలుగు నెలల్లో వాడాలి. గాలిలో ఆక్సిజన శాతం 22 నుంచి 19కి తగ్గింది. ఈ ఆయుర్వేద ఆయిల్ ను వాడటం ద్వారా స్వచ్ఛమైన గాలిని లోపలకు పంపు చేస్తోంది. ఒక బొట్టు ఆయుర్వేద ఆయిల్ ను వాడటం ద్వారా 24 గంటల్లో 910 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని నిపుణులు చెబుతున్న మాట. తద్వారా కరోనా కోరల నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు నిపుణులు. కరోనాతో ఆసుపత్రులకు వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టపెట్టలేక చాలా మంది ఇప్పుడు ఆయుర్వేదం వైపే దృష్టి పెడుతున్నారు.

ఆయుర్వేద వైద్యానికి కేరాఫ్ అడ్రస్….

కేరళ వంటి రాష్ట్రంలో ఆయుర్వేదం వైపే ఎక్కువ మంది ప్రజలు అడుగేస్తున్నారు. తెలిసో తెలియకో చాలా మంది దాన్నే వాడుతున్నారు. కరోనా నివారణకు పెరిటి వైద్యాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు ఫలితాలనిస్తే టీకాల కంటే ఆయుర్వేదం పైనే ఎక్కువగా సర్కార్ దృష్టి పెట్టే వీలుంది. అందుకే ఆయుర్వేదం ఉన్న అద్భుత సారాన్ని తెలుసుకుని ప్రజలకు అందించాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ఫలితంగా ప్రజల ప్రాణాలను కాపాడినట్లు అవుతోంది.

  • కొండవీటి శివనాగ్ రాజు, సీనియర్ జర్నలిస్టు