ఫైజర్ బాటలోనే మేమూ, తగ్గిపోయిన ఉత్పత్తి, ఈయూ దేశాలకు సరఫరాను కుదిస్తాం, ఆస్ట్రాజెనికా ప్రకటన.

తమ ఉత్పత్తులు తగ్గిన కారణంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు తమ డెలివరీని తగ్గిస్తామని బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా ఉత్పాదక సంస్థ ప్రకటించింది..

  • Updated On - 1:09 pm, Sat, 23 January 21 Edited By: Pardhasaradhi Peri
ఫైజర్ బాటలోనే మేమూ, తగ్గిపోయిన ఉత్పత్తి, ఈయూ దేశాలకు సరఫరాను కుదిస్తాం, ఆస్ట్రాజెనికా ప్రకటన.

Covid Vaccine:తమ ఉత్పత్తులు తగ్గిన కారణంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు తమ డెలివరీని తగ్గిస్తామని బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా ఉత్పాదక సంస్థ ప్రకటించింది. ఈ తొలి మూడు నెలల్లో ఈ దేశాలకు 60 శాతం నుంచి 31 మిలియన్ డోసులకు కుదిస్తామని వెల్లడించింది. మార్చి మాసాంతానికి ఈయూ లోని 27 దేశాలకు 80 మిలియన్ డోసుల ఆస్ట్రాజెనికాను సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రొడక్షన్ తగ్గిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని, బెల్జియం లోని తమ పార్ట్ నర్ నోవాసెప్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి తగ్గడమే కారణమని వివరించింది. ఈయూ భాగస్వామ్య దేశాలకు ఇప్పటికే ఫైబర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ల డెలివరీలో జాప్యం జరుగుతోంది. ఇందుకు రవాణాలో ఆలస్యం జరగడం ఓ కారణం కాగా- ఈ టీకామందు ఉత్పత్తి తగ్గడం కూడా మరో కారణమవుతోంది. అయితే రానున్న నెలల్లో ఈ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు.