సెల్ఫ్ ఐసోలేషన్ లో అరవింద్ కేజ్రీవాల్.. ‘గెట్ వెల్ సూన్’ అంటున్న ‘ఆప్’

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. స్వల్ప జ్వరం, గొంతు నొప్పితో బాధ పడుతున్న ఆయనకు మంగళవారం కరోనా టెస్ట్ చేస్తారని ఆప్ వర్గాలు..

సెల్ఫ్ ఐసోలేషన్ లో అరవింద్ కేజ్రీవాల్.. గెట్ వెల్ సూన్ అంటున్న ఆప్

Edited By:

Updated on: Jun 08, 2020 | 3:03 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. స్వల్ప జ్వరం, గొంతు నొప్పితో బాధ పడుతున్న ఆయనకు మంగళవారం కరోనా టెస్ట్ చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. 51 ఏళ్ళ కేజ్రీవాల్ ఆదివారం మధ్యాహ్నం నుంచే అస్వస్థులుగా ఉన్నారని, అప్పటినుంచీ ఎవరినీ కలుసుకోలేదని, తన అధికారిక కార్యక్రమాలనన్నింటినీ రద్దు చేసుకున్నారని  ఈ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు డయాబెటిస్ కూడా ఉండడంతో కొంత ఆందోళన చెందుతున్నామని ఆప్ నేతలు  పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు జరుపుతున్నారని, అయితే పార్టీ సభ్యులు, కేబినెట్ సహచరులు, బ్యూరోక్రాట్లతో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటూ వచ్చారని ఈ నేతలు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆప్ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులంతా ట్వీట్లు చేశారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us