‘ఢిల్లీ కరోనా యాప్’.. రిలీజ్ చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 3:46 PM

'ఢిల్లీ కరోనా' పేరిట సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఓ యాప్ ని విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల లభ్యతను ఇది తెలియజేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు...

ఢిల్లీ కరోనా యాప్.. రిలీజ్ చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
Follow us on

‘ఢిల్లీ కరోనా’ పేరిట సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఓ యాప్ ని విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల లభ్యతను ఇది తెలియజేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనేక హాస్పిటల్స్ లో బెడ్ లు, వెంటిలేటర్లు, ఐసీయూలు తక్కువగా ఉన్నాయని, ఫలితంగా చాలామంది కరోనా రోగులు మరణిస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,731 పడకలు అందుబాటులో ఉన్నాయని, వీటిలో 4,100 పడకలు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. కానీ ఈ విషయం ప్రజలకు తెలియదన్నారు. ఈ యాప్ రోజులో ఉదయం పది గంటలకు ఒకసారి, తిరిగి సాయంత్రం 6 గంటలకు మరోసారి అప్ డేట్ అవుతుందని ఆయన వివరించారు.ఏదైనా హాస్పటల్ లో పడక ఖాళీగా ఉన్నట్టు ఈ యాప్ ద్వారా తెలుసుకున్న రోగి ఆ హాస్పిటల్ కి వెళ్లినా అడ్మిట్ చేసుకునేందుకు ఆసుపత్రి నిరాకరించిన పక్షంలో ఆ రోగి ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబరుకు (1031) ఫోన్ ద్వారా  ఫిర్యాదు చేయవచ్చునని కేజ్రీవాల్ వివరించారు.