ప‌ది ప‌రీక్ష‌లు మ‌రోసారి వాయిదా

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల్ని రెండు వారాల పాటూ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మార్చి 31 తర్వాత రీ షెడ్యూల్ ..

ప‌ది ప‌రీక్ష‌లు మ‌రోసారి వాయిదా

Updated on: Mar 24, 2020 | 12:41 PM

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల్ని రెండు వారాల పాటూ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మార్చి 31 తర్వాత రీ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. వాస్తవానికి పరీక్షలు మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు నిర్వహించాల్సి ఉంది. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లును అధికారులు చేస్తున్నారు. కానీ పరిస్థితులు మారిపోవడం.. ఏపీలో లాక్‌డౌన్ ప్రకటించడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో మొదటిసారి వాయిదా వేశారు.. కరోనా దెబ్బకు రెండోసారి వాయిదాపడ్డాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us