ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో పలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి సచివాలయ, అసెంబ్లీ, శాఖాధిపతుల కార్యాలయాల్లో.. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఉచిత వసతి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫ్రీ వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో మొత్తం 750 ఉద్యోగులు లద్ధిపొందుతున్నారు. ఇందులో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఆగష్టు 1వ తేదీ నుంచి.. జులై 31, 2021 వరకూ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఈ తాజా నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read More:
బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?
కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి
సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు