AP Coronavirus roundup: ఏపీలో 4,157 కేసులు.. భారీగా పెరిగిన మరణాలు.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు అత్యవసర చికిత్స

|

Apr 14, 2021 | 6:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతుంది. వైరస్‌ బారినపడుతున్న వారి రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 35,732 టెస్టులు చేయగా..

AP Coronavirus roundup: ఏపీలో 4,157 కేసులు.. భారీగా పెరిగిన మరణాలు.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు అత్యవసర చికిత్స
Ap Corona
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతుంది. వైరస్‌ బారినపడుతున్న వారి రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 35,732 టెస్టులు చేయగా.. 4,157 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,049కు చేరింది. కొత్తగా కరోనా కారణంగా నెల్లూరులో నలుగురు చనిపోగా.. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురు చొప్పున, విశాఖలో ఇద్దరు బాధితులు, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,339కి చేరింది.

24 గంటల వ్యవధిలో కొత్తగా 1,606 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 9,01,327కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,34,460 నమూనాలను టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కేసులు వెలుగుచూశాయి.

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అత్యవసర చికిత్స….

కాగా  తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.  వైరస్ సోకినా అశ్రద్ధ చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్య తీవ్రం అయ్యింది.  శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంవో నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.

Also Read: పురుషులే ఇలా… ఈ ఫోటో వెనుక అర్థం వేరు, పరమార్థం వేరు.. స్టోరీ చదివితే ఆ వ్యక్తులకు హ్యాట్సాఫ్ చెబుతారు

టాలీవుడ్‌లో కరోనా టెన్షన్.. పలువురు సెలబ్రిటీలకు పాజిటివ్.. తాజా రిపోర్ట్ ఇది