Andhra Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 30,578 శాంపిల్స్ ని పరీక్షించగా 4,605 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2293171 కి చేరింది. అనంతపురం(Anantapur District), కడప, కర్నూలు(Kurnool) జిల్లాల్లో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు(Guntur), ప్రకాశం, విజయనగరం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 14641కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 93488 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 11,729 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2185042కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,25,71,365 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 642 కొత్త కేసులు వెలుగుచూశాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. జిల్లాలో కొత్తగా 539 కేసులు నమోదయ్యాయి.
కరోనా సమాచారం మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
●వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
Also Read: మాకేదీ వినిపించదు..మాటలు కూడా రావు..! నమ్మారో ఇక అంతే!!