జగన్ సర్కార్ శుభవార్త..వాహనమిత్ర రూ.10వేల సాయానికి దరఖాస్తుల ఆహ్వానం

పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేస్తామని చెప్పారు. వాహన మిత్ర పథకం ద్వారా సాయం పొందాలనుకునే వారికి

జగన్ సర్కార్ శుభవార్త..వాహనమిత్ర రూ.10వేల సాయానికి దరఖాస్తుల ఆహ్వానం

Updated on: May 18, 2020 | 12:55 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రప్రజలకు మరో శుభవార్తనందించారు. కరోనా, లాక్ డౌన్ కష్టకాలంలో ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో విడత వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వివరాలు వెల్లడించారు.

ఓనర్ కమ్ డ్రైవర్లు.. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేస్తామని చెప్పారు. వాహన మిత్ర పథకం ద్వారా సాయం పొందాలనుకునే వారికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు అవకాశం కల్పించారు. అర్హులు సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా రవాణాశాఖకు సంబంధించిన డీటీసీ స్థాయి నుంచి ఎంవీఐ ఆఫీస్ వరకు.. ఈ- సేవ, మీ- సేవ, సీఎస్ సీ, ఎండీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో డ్రైవర్లు తమ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఇటు గ్రామ, వార్డు వాలంటీర్ల వద్ద కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచడంతో ఈ ప్రక్రియ సులభతరం చేశారు. జూన్ 4న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు మంత్రి పేర్ని నాని. గతేడాది లబ్దిపొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us