రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం యు ద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ప్పటికీ, రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతోంది. తాజాగా గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో కొత్తగా మరో 80 కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో తెలియజేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 893కు చేరుకుంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మొత్తం 6522 నమూనాలు సేకరించి పరీక్షించగా.. వాటిలో 80 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 31 కేసులు నమోజయ్యాయి. గుంటూరులో 18, చిత్తూరులో 14, అనంతపురంలో 6, తూర్పు గోదావరిలో 8, కృష్ణాలో 2, ప్రకాశంలో 2, విశాఖలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 234కు చేరుకోగా.. గుంటూరులో 195, కృష్ణా జిల్లాలో 88, చిత్తూరులో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా బారిన పడి మరో ముగ్గురు బాధితులు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతిచెందగా.. కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో కరోనా నుంచి 21 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 141 మంది కరోనా నుంచి బయట పడ్డారు. తాజాగా కోలుకున్న వారిలో కృష్ణాలో 9మంది, చిత్తూరులో ఏడుగురు, కడపలో 5 మంది డిశ్చార్జి చేయ బడ్డారు.
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,034 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమం లో రాష్ట్రం అత్యధిక స్థాయి నిర్థారణ పరీక్షలతో మొదటిస్థానలో నిలిచింది. తాజాగా రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో 961 మందికి నమూనాలు సేకరించి, నిర్థారిస్తున్నారు.