AP Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 38,746 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 864 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 20,30,849 మంది కరోనా వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి బారినపడి 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 14,010కి చేరింది.
ఇక, ఒక్కరోజు వ్యవధిలో 1,310 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,02,187 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,652 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,73,63,641 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియనే వేగవంతం చేసింది ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లిన చో తప్పక మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా నమోదైన కరోనా వైరస్ కేసులు ఇలా ఉన్నాయి….
Read Also…. NIOS Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం.