AP Corona Cases: ఏపీలో తగ్గుముఖం పట్టిన క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో 11 మంది మృత్యువాత‌..!

|

Feb 02, 2022 | 7:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా పెరుగుతున్న కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,040 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 5,983 మందికి పాజిటివ్‌గా తేలింది.

AP Corona Cases: ఏపీలో తగ్గుముఖం పట్టిన క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో 11 మంది మృత్యువాత‌..!
Ap Corona
Follow us on

Andhra Pradesh Covid 19 Cases today updates: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత కొంత కాలంగా పెరుగుతున్న కరోనా కేసులు(Coronavirus) తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,040 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 5,983 మందికి కొవిడ్(Covid 19) పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,88,566కు చేరుకుంది. అయితే, మంగళవారం 6,213 కేసులు నమోదు కాగా బుధవారం స్వల్పంగా తగ్గాయని ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గతుండటంతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంటోంది.

థర్డ్ వేవ్ మొదలైన తర్వాత జనవరిలో ఏపీలో కొత్త కేసులు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతూ వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ప్యూతో పాటు పలు ఆంక్షలు విధించడంతో కరోనా కేసుల సంఖ్య దిగి వస్తోంది.కాగా, గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా కొత్త11 మంది ప్రాణాలు వదిలారు. అయితే, నిన్న ఒక్కరోజే 11,289 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,73,313కి చేరింది.

ఇక, క‌రోనా వ‌ల్ల నిన్న ప‌ద‌కొండు మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల విశాఖపట్నం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పు న మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,631కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,622 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,25,40,787 నమూనాలను పరీక్షించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Read Also…. Ramanujacharya Sahasrabdi Photos: శ్రీరామనగరంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం.. చిత్రాలు