కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో 837 కొత్త‌ కేసులు.. ఎనిమిది మరణాలు

| Edited By:

Jul 03, 2020 | 1:25 PM

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది . గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 837 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో 837 కొత్త‌ కేసులు.. ఎనిమిది మరణాలు
Follow us on

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది . గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 837 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 16,934కు చేరింది.  ఇందులో రాష్ట్రంలో కొత్తగా 789 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 46 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో ఎనిమిది కరోనా మరణాలు సంభవించాయి. కర్నూల్ జిల్లాలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 206కి చేరింది. అలాగే 9,096 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో తాజాగా 38,898 పరీక్షలు నిర్వహించగా.. అందులో 789 కొత్త కేసులు వచ్చాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,414కు చేరింది.  వారిలో తాజాగా 258 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం డిశ్చార్జి సంఖ్య 6,126కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 8,082 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా అనంతపురంలో 149 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా ఇద్దరికి కరోనా సోకగా.. వారికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 409కు చేరింది. అందులో 249 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 46 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,111కు చేరింది. వీరిలో 1,346 డిశ్చార్జి అవ్వగా.. 765 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కాగా రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య 9,71,611కు చేరింది.