AP Corona Cases: పండుగ పూట పెరిగిన కేసులు.. తాజా కోవిడ్ హెల్త్ బులిటెన్ ఇదే..

|

Jan 16, 2022 | 5:11 PM

తాజాగా  ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించేలా చర్యలు చేపడుతోంది.

AP Corona Cases: పండుగ పూట పెరిగిన కేసులు.. తాజా కోవిడ్ హెల్త్ బులిటెన్ ఇదే..
Ap Corona Cases
Follow us on

AP Corona Bulletin: కరోనా మహమ్మారి (Covid-19) తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు (AP Corona Bulletin) పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా  ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించేలా చర్యలు చేపడుతోంది. మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు పోలీసులు.

ఏపీలో గడిచిన 24 గంటల్లో (శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు) 30,022 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4,570 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా రక్కసి ఒక్కరిని బలి తీసుకుంది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,03,385కి చేరగా.. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,510గా ఉంది.

కాగా.. గత 24 గంటల్లో 669 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 20,62,105 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 26770 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇదిలావుంటే.. ఏపీలోని రెండు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో 1124 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నంలో 1028 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి: MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..

BSF Recruitment 2022: దేశ సరిహద్దుల్లో పనిచేయాలనుకుంటున్న యువకులకు గుడ్‌న్యూస్.. బీఎస్ఎఫ్‌ భారీ నోటిఫికేషన్‌..