ఆన్‌లైన్ షాపింగ్ః రూ.300 లోషన్ ఆర్డర్ చేస్తే.. రూ.19 వేల వ‌స్తువు వ‌చ్చింది

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 9:50 PM

ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌లో ఒక‌దానికి బ‌దులు మ‌రొక‌టి రావ‌టం సాధార‌ణంగానే జ‌రుగుతుంటాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతుంటారు. వేలకు వేలు డబ్బులు పే చేశాక ఒక్కోసారి నకిలీ ఐటెమ్స్ డెలివరీ అవుతుంటాయి. ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, రాళ్లు...

ఆన్‌లైన్ షాపింగ్ః రూ.300 లోషన్ ఆర్డర్ చేస్తే.. రూ.19 వేల వ‌స్తువు వ‌చ్చింది
Follow us on

ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌లో ఒక‌దానికి బ‌దులు మ‌రొక‌టి రావ‌టం సాధార‌ణంగానే జ‌రుగుతుంటాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతుంటారు. వేలకు వేలు డబ్బులు పే చేశాక ఒక్కోసారి నకిలీ ఐటెమ్స్ డెలివరీ అవుతుంటాయి. ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, రాళ్లు వచ్చిన వార్తలు కూడా విన్నాం. దీని వల్ల చాలా సార్లు వినియోగదారుడికే నష్టం కలిగేలా ఉంటుంది. కానీ ఓ వ్యక్తికి మాత్రం లక్కు తగిలింది. రూ. 300 విలువ చేసే బాడీ లోషన్ బుక్ చేస్తే ఏకంగా రూ. 19 వేల ఇయర్ బడ్ వచ్చింది. దాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పినా అమెజాన్ వాటిని తిరిగి తీసుకోలేకపోయింది. దీంతో ఈ విషయాన్ని స‌ద‌రు వ్యక్తి సోషల్ మీడియా చేయ‌టంతో ఇప్పుడ‌ది కాస్తా వైర‌ల్‌గా మారింది.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన గౌతమ్ రేజ్ అనే వ్యక్తి ఆన్ లైన్ షాపింగ్ అమెజాన్ లో రూ. 300 విలువ చేసే స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే .. 19 వేలు విలువ చేసే హెడ్ ఫోన్స్ వచ్చాయి. ఇంకేముంది షాక్ తినడంతో పాటు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. కానీ, మనకెందుకులే అనుకుని కస్టమర్ కేర్ కు కాల్ చేసి రిటర్న్ తీసుకోవాలని, తాను ఆర్డర్ చేసిన వస్తువిస్తే చాలని చెప్పాడు. దీంతో అది నాన్ రిటర్నెబుల్ ఐటమ్ కావడంతో రిటర్న్ తీసుకోవడం కుదరదని సమాధానం చెప్పడమే కాకుండా.. ఆర్డర్ చేసిన స్కిన్ లోషన్ ఇవ్వలేకపోయామని సారీ చెప్తూ దాని డబ్బులు రూ.300 కూడా తిరిగి ఇచ్చేశారు కంపెనీవాళ్లు. క‌రోనా, లాక్‌డౌన్ కారణంగా చాలా రోజుల తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ ప్రారంభం అయ్యాయి. దీంతో కస్టమర్లు ఆకట్టుకునేందుకు ఈ కామర్స్ కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.