కరోనా కట్టడిలో కేంద్రం విఫలం

లాక్‌డౌన్‌తో కరోనా మహమ్మారిని కట్డడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా విఫలమైందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్న సమయంలో ఆంక్షల్ని ఎత్తివేస్తున్న ఏకైక దేశం భారత్ అని ఆరోపించారు.

కరోనా కట్టడిలో కేంద్రం విఫలం

Updated on: May 26, 2020 | 2:53 PM

లాక్‌డౌన్‌తో కరోనా మహమ్మారిని కట్డడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా విఫలమైందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్న సమయంలో ఆంక్షల్ని ఎత్తివేస్తున్న ఏకైక దేశం భారత్ అని ఆరోపించారు. కోవిడ్ సంక్షోభం, లాక్‌డౌన్‌తో పాటు ఇత‌ర అంశాల‌పై రాహుల్ గాంధీ వీడియోకాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు.

లాక్‌డౌన్ ముగింపు స‌మీపిస్తున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎటువంటి వ్యూహాన్ని అనుస‌రించ‌నున్న‌దో చెప్పాలని డిమాండ్ చేశారు. మే నెల చివ‌ర వ‌ర‌కు వైర‌స్ త‌గ్గుద‌ల ఉంటుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ద‌ని, కానీ వైర‌స్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. రెండో విడత కోవిడ్ విజృంభిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.