ఇట్స్ క‌రోనా టైమ్‌..పుట్టిన పిల్ల‌ల‌కు పేర్లు కూడా…ఇవే !

|

Apr 02, 2020 | 3:24 PM

కొత్త ఒక వింత‌..పాత ఒక …అన్న సామెత ఇక్క‌డ అక్ష‌రాల నిజ‌మేన‌నిపిస్తుంది. ప్రజలు ట్రెండ్‌ను ఫాలో అవడంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ, మరీ ఇలా పిల్లలకు పేర్లు పెట్టేలా ట్రెండ్‌ను వాడేయడం మాత్రం చిత్రంగానే అనిపిస్తోంది. భార‌త్‌తో పాటు ప్రపంచ‌ దేశాలను కరోనా ర‌క్క‌సి గడగడలాడిస్తోంది. దీంతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. ప్రజలు బయట అడుగుపెట్టడానికే భయపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్ ప్రకటించి బయట తిరిగే వ్యక్తులకు శిక్షలు విధిస్తున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య […]

ఇట్స్ క‌రోనా టైమ్‌..పుట్టిన పిల్ల‌ల‌కు పేర్లు కూడా...ఇవే !
Follow us on
కొత్త ఒక వింత‌..పాత ఒక …అన్న సామెత ఇక్క‌డ అక్ష‌రాల నిజ‌మేన‌నిపిస్తుంది. ప్రజలు ట్రెండ్‌ను ఫాలో అవడంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ, మరీ ఇలా పిల్లలకు పేర్లు పెట్టేలా ట్రెండ్‌ను వాడేయడం మాత్రం చిత్రంగానే అనిపిస్తోంది. భార‌త్‌తో పాటు ప్రపంచ‌ దేశాలను కరోనా ర‌క్క‌సి గడగడలాడిస్తోంది. దీంతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. ప్రజలు బయట అడుగుపెట్టడానికే భయపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్ ప్రకటించి బయట తిరిగే వ్యక్తులకు శిక్షలు విధిస్తున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ సేవలందిస్తున్నారు. అటువంటి వారికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో అయితే కొందరు ఈ లాక్ డౌన్ కాలంలో తమకు పుట్టిన పిల్లలకు లాక్ డౌన్, కరోనా అనే పేర్లు పెడుతున్నారు.
దొయిరా జిల్లాలోని కుకుండు గ్రామంలో ఓ మాతృమూర్తి లాక్ డౌన్ సమయంలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు ‘లాక్ డౌన్’ అని పేరు పెట్టారు. దీనిపై ఆ బాబు తండ్రి  తమకు లాక్ డౌన్ కాలంలో బాబు జన్మించాడనీ,  కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారనీ,  జాతి ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ బాబుకు లాక్ డౌన్ అని పేరు పెట్టామనీ చెప్పారు.
అలాగే   ఘోరక్ పూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మహిళ   జనతా కర్ఫ్యూ  సమయంలో  తనకు పుట్టిన బిడ్డకు కరోనా అని పేరు పెట్టుకుంది.  తన బిడ్డ పేరు విన్న వారంతా మహామ్మారి కరోనా నుంచి బయటపడటానికి చైతన్య వంతులవ్వాలన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టానని ఆమె చెప్పింది. ఇలా విప్క‌ర స్థితిలోనూ ప్ర‌జ‌లు వినూత్న ఆలోచ‌న‌లు చేస్తున్నారు.