OMG..!! కరోనా ఎఫెక్ట్‌తో విదేశాంగ మంత్రి సలహాదారు మృతి..

| Edited By:

Mar 06, 2020 | 6:12 PM

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ఈ వైరస్ మహమ్మారినపడి ప్రాణాలు వదిలారు. ఈ కరోనాను కనుగొన్న వైద్యుడిని కూడా ఇది బలిగొంది. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి సామాన్యులే మృతిచెందగా.. తాజాగా ఇది ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వాధికారులను కూడా వదల్లేదు. ఇరాన్ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖొలెస్లాం కరోనా ఎపెక్ట్‌తో గురువారం రాత్రి మరణించినట్లు ఆ దేశ అధికారులు […]

OMG..!! కరోనా ఎఫెక్ట్‌తో విదేశాంగ మంత్రి సలహాదారు మృతి..
Follow us on

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ఈ వైరస్ మహమ్మారినపడి ప్రాణాలు వదిలారు. ఈ కరోనాను కనుగొన్న వైద్యుడిని కూడా ఇది బలిగొంది. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి సామాన్యులే మృతిచెందగా.. తాజాగా ఇది ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వాధికారులను కూడా వదల్లేదు. ఇరాన్ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖొలెస్లాం కరోనా ఎపెక్ట్‌తో గురువారం రాత్రి మరణించినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే ఇరాన్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలకి ఈ వైరస్ సోకడంతో.. వారంతా స్వచ్ఛందంగా నిర్భందంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

మరోవైపు భారత్‌లో కూడా ఈ వైరస్.. తన ప్రభావాన్ని మెల్లి మెల్లిగా చూపిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 31కి చేరింది.