Remdesivir: రెమిడెసివర్ కొరత.. ఆసరా చేసుకుంటున్న కేటుగాళ్లు.. బ్లాక్‌లో యధేచ్చగా దందా.. డమ్మీ ప్రిస్క్రిప్షన్లతో కొనుగోళ్లు..!

|

Apr 22, 2021 | 10:54 AM

కరోనాకు రెమిడెసివర్‌ మందు కాదు.. ఈవిషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ప్రకటించింది.. రెమిడెసివర్‌తో పెద్దగా లాభం ఉండదు. అయినప్పటికి కరోనా ట్రీట్‌మెంట్‌కు ఇది దివ్య ఔషథం అని జనం పరిగెత్తుతున్నారు.

Remdesivir: రెమిడెసివర్ కొరత.. ఆసరా చేసుకుంటున్న కేటుగాళ్లు.. బ్లాక్‌లో యధేచ్చగా దందా..  డమ్మీ ప్రిస్క్రిప్షన్లతో కొనుగోళ్లు..!
Acute Shortage Of Remdesivir
Follow us on

Remdesivir Shortage: కరోనాకు రెమిడెసివర్‌ మందు కాదు.. ఈవిషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ప్రకటించింది.. రెమిడెసివర్‌తో పెద్దగా లాభం ఉండదు..అత్యవసర పరిస్థితుల లోనే వినియోగించాలని ఐసీఎంఆర్‌తో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా పదేపదే వివరణ ఇస్తోంది.. అయినప్పటికి కరోనా ట్రీట్‌మెంట్‌కు ఇది దివ్య ఔషథం అని జనం పరిగెత్తుతున్నారు. వేల రూపాయలు పెట్టి బ్లాక్‌మార్కెట్‌లో కొంటున్నారు.

Remdesivir: రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ ధరలు కంపెనీని బట్టి రూ.899 నుంచి రూ.3,490 వరకు ఉన్నాయి. కానీ, ఈ తరహా ఔషధాలకు కొరత ఏర్పడటంతో మందుల మాఫియా దందాకు తెరలేపింది. ఈ ముఠాలు కరోనా రోగుల అవసరాన్ని అడ్డంపెట్టుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. అందినకాడికి దండుకుంటున్నాయి. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, మాఫియా ముఠాలతోపాటు కొందరు వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి కూడా ఈ దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. డిమాండ్‌ను బట్టి రెమిడిసివిర్‌ను రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు, ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సిద్ధమనే వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు.

రెమిడెసివిర్, తుసిలిజుమాబ్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు సాధారణ మార్కెట్లో విక్రయించడం లేదు. అత్యవసర సమయంలో వాడకానికి మాత్రమే వాటికి అనుమతి ఉంది. పైగా ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వీటికి కరోనా మరణాలను ఆపగలిగే సామర్థ్యం లేదని, రోగి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుతాయని డాక్టర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. రక్తంలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ 90 శాతం వరకు ఉండి, వెంటిలేటర్‌ లేదా ఆక్సిజన్‌పై చికిత్స చేస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రెమిడిసివిర్‌ను వాడాలి. పైగా కరోనా పాజిటివ్‌గా గుర్తించిన మొదటి 9 రోజుల్లోనే ఇవ్వాలి. అప్పుడే రోగి కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది కూడా. కానీ కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని డాక్టర్లు డబ్బుల కోసం ఈ ఔషధాలను విరివిగా వాడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

నిజానికి అవసరం ఉన్నా లేకున్నా కూడా కొన్ని ఆస్పత్రులు రోగుల బంధువులపై ఒత్తిడి తెచ్చి ఈ ఔషధాలను తెప్పిస్తున్నాయని.. వాటిని సదరు రోగికి వాడుతున్నారా లేదా కూడా తెలియడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.