కరోనా టెస్టింగ్ కార్డు కేవలం రూ. 370కే..

|

Aug 29, 2020 | 1:57 AM

కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులను మరింత సులభం చేసేలా అబాట్ అనే సంస్థ సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ పరికరం ద్వారా కరోనా పరీక్షలను మనమే స్వయంగా చేసుకోవచ్చు.

కరోనా టెస్టింగ్ కార్డు కేవలం రూ. 370కే..
Follow us on

Card-Sized COVID-19 Test: కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులను మరింత సులభం చేసేలా అబాట్ అనే సంస్థ సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ పరికరం ద్వారా కరోనా పరీక్షలను మనమే స్వయంగా చేసుకోవచ్చు. ‘అబాట్ బైనాక్స్ నౌ కోవిడ్ 19 ఏజీ కార్డు’ అని పిలిచే ఈ పరికరానికి యూఎస్ ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదముద్ర వేసింది. ఇక దీని ధర రూ. 370గా నిర్ధారించబడింది. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

ఈ కార్డును ఏ చోటైనా కూడా వాడే సౌకర్యం ఉండగా.. ఈ కార్డుతో ముక్కు ద్వారా కరోనా టెస్టింగ్ చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో ఫలితాలు వచ్చేస్తాయి. ఆ రిజల్ట్స్ చూసుకునేందుకు అబాట్ సంస్థ ‘ఎన్‌ఏవీఐసీఏ’ అనే పేరిట ఓ మొబైల్ యాప్‌ను కూడా లాంచ్ చేసింది. నెగటివ్ వచ్చినవారికి డిజిటల్ పాస్ జారీ కానుండగా.. పాజిటివ్ వచ్చినవారు ల్యాబ్‌కు వెళ్లి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ టెస్టింగ్ కిట్‌ను అమెరికాలో లాంచ్ చేయగా.. ఇండియాలో మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించట్లేదు.