Corona Virus: ఆ మాస్క్‌లతో ఏకంగా ఓ ఫుట్‌బాల్ స్టేడియంనే నింపొచ్చట.. నివ్వెరపోయే అంశాలు చెప్పిన నిపుణులు..!

|

Jan 18, 2021 | 8:02 AM

Corona Virus: కరోనాను అడ్డుకునేందుకు మాస్క్ ధరించమంటే.. ఆ మాస్కులతో మరిన్ని రోగాలు వ్యాప్తి చెందేలా ప్రవర్తిస్తున్నారు జనాలు.

Corona Virus: ఆ మాస్క్‌లతో ఏకంగా ఓ ఫుట్‌బాల్ స్టేడియంనే నింపొచ్చట.. నివ్వెరపోయే అంశాలు చెప్పిన నిపుణులు..!
Follow us on

Corona Virus: కరోనాను అడ్డుకునేందుకు మాస్క్ ధరించమంటే.. ఆ మాస్కులతో మరిన్ని రోగాలు వ్యాప్తి చెందేలా ప్రవర్తిస్తున్నారు జనాలు. ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా సోకుతుందని, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరంచాలని నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. అయితే మాస్క్‌ల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా జనాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా కరోనా వ్యాప్తిని మరింత పెంచడంతో పాటు.. ఇతర ఇన్‌ఫెక్షన్లకూ కారకులవుతున్నారు.

అసలు విషయంలో వెళితే.. కరోనా విజృంభన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లను విధిగా ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ మాస్క్‌ల వాడకం పూర్తయిన తరువాత.. వాటిని బాధ్యతారహితంగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దాంతో ఇతర ఇన్‌ఫెక్షన్లు సోకేందుకు కారణం అవుతున్నారు. ముఖ్యంగా మనదేశంలో చూసుకున్నట్లయితే పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. ఓ సర్వే నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ప్రతి వంద మందిలో నలుగురు వ్యక్తులు తమ మాస్క్‌లను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారట. అలా రోడ్లపై ఇష్టానుసారంగా పడేసిన మాస్కులతో ఏకంగా ఒక ఫుట్ బాల్ స్టేడియంనే నింపేయొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఆరోగ్యకర్తల మాస్క్‌ల వినియోగంపైనా పరిశీలకులు కీలక అంశాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలు ప్రతి రోజు దాదాపు 30 లక్షల మాస్క్‌లను వినియోగిస్తుంటారని అంచానా వేశారు. వీటితో ఏకంగా ఏడు ఫుట్‌బాల్ మైదానాలను నింపొచ్చని పేర్కొన్నారు. అయితే మాస్క్‌లను ఇలా నిర్లక్ష్యంగా పడేయడం వల్ల ప్రజలు ఇతర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని, ఇకనైనా ప్రజలు బాధ్యతగా ప్రవర్తిస్తే ముప్పు నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also read:

Clashes: ఉప్పర్‌‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రహరీ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి..

Anand Devarakonda: అన్నయ్యలా అతడు కూడా స్టార్ అవుతాడా.. వరుస సినిమాలతో దూసుకెళుతున్న యువ హీరో..