“మహా” పోలీసులకు కరోనా టెన్షన్.. 70కి చేరిన మృతుల సంఖ్య..

| Edited By:

Jul 06, 2020 | 8:25 PM

మహారాష్ట్ర పోలీసులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. అందులో ముంబై నగరంలోనే ఎక్కువగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే..

మహా పోలీసులకు కరోనా టెన్షన్.. 70కి చేరిన మృతుల సంఖ్య..
Follow us on

మహారాష్ట్ర పోలీసులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. అందులో ముంబై నగరంలోనే ఎక్కువగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా కరోనా వారియర్స్‌గా విధులు నిర్వర్తించే పోలీసులు కరోనా వైరస్‌ బారిన పడుతుండటంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 279 మంది పోలీసు సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడ్డ సిబ్బంది సంఖ్య 5,454కి చేరింది. ప్రస్తుతం 1,078 యాక్టివ్ కేసులు ఉన్నాయని మహారాష్ట్ర పోలీస్ అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు డెబ్బై మంది సిబ్బంది మరణించారు.