“మహా” పోలీసులపై కరోనా పంజా.. తాజాగా మరో 222 మంది సిబ్బందికి పాజిటివ్..

| Edited By:

Jul 10, 2020 | 4:41 PM

కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వదలడం లేదు. రోజుకు పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గడిచిన 48 గంటల్లో 222 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా..

మహా పోలీసులపై కరోనా పంజా.. తాజాగా మరో 222 మంది సిబ్బందికి పాజిటివ్..
Follow us on

కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వదలడం లేదు. రోజుకు పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గడిచిన 48 గంటల్లో 222 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడ్డ పోలీసు సిబ్బంది సంఖ్య 5,935కి చేరింది. గడిచిన 48 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు సిబ్బంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 74 మంది పోలీసు సిబ్బంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి ఇప్పటి వరకు 4,715 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.

కాగా, దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రెండు లక్షల మార్క్ దాటేసింది. ముఖ్యంగా ముంబై నగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది.