Corona Third Wave: కరోనా మహమ్మారి దేశాన్ని తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది. మొదటి వేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌లో మరణాలు, కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్నాయి. యావత్ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ క్రమంలోనే సెకండ్ వేవ్ ఇంకా ముగియక ముందే థర్డ్ వేవ్ భయపెట్టిస్తోంది. ఈసారి చిన్నారులను టార్గెట్ చేస్తూ వస్తోందని వార్తలు వస్తోన్న వేళ తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి.
ఇదిలా ఉంటే కరోనా థార్డ్ వేవ్ చిన్నారులనే టార్గెట్ చేస్తుందని చర్చ జరుగుతోన్న వేళ.. కర్ణాటక రాష్ట్రంలోని గణంకాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల మంది చిన్నారులు అంటే 11 శాతం మంది పోషకాహార లోపం, తక్కువ భరువుతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాపిస్తే ఇలాంటి చిన్నారుల పరిస్థితి ఏంటన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పోషాకాహార లోపం ఉన్న చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఈ కారణంగా త్వరగా వైరస్‌బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ 2019-2020 సర్వే ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 8.4 శాతం చిన్నారులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా.. 32.9 శాతం మంది తక్కువ బరువుతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటకలో ఇప్పటి వరకు 0 నుంచి 9 ఏళ్ల వయసున్న చిన్నారులు ఏకంగా 39,000 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే థార్డ్ వేవ్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మార్చి 18 వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 0-9 ఏళ్ల వారు,10-19 ఏళ్ల వారు ఎక్కువగా ఉండడం గమనార్హం.
Telangana Lockdown : తెలంగాణలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు
Dipcovan: డీఆర్‌డీఓ నుంచి మరో అస్త్రం.. కోవిడ్ యాంటిబాడీ డిటెక్షన్ కిట్ ‘డిప్కోవాన్’ అభివృద్ధి