దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు ఇవే..

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. కొత్తగా 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 6761కు చేరింది. ప్రస్తుతం 6039 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 516 మంది రికవరీ అయ్యారు. ఇక ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 206కు చేరింది. కాగా.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం […]

Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 10:13 PM

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. కొత్తగా 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 6761కు చేరింది. ప్రస్తుతం 6039 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 516 మంది రికవరీ అయ్యారు. ఇక ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 206కు చేరింది.

కాగా.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. సోమవారం ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం లాక్‌డౌన్‌ను మరో రెండు లేదా మూడు వారాలపాటు కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తీర్మానం కూడా చేశాయి.