పరిస్థితి మరింత దిగజారుతోంది.. కరోనాపై డబ్ల్యూహోచ్‌ఓ హెచ్చరిక

కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి మరింత దిగజారుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ఆదివారం నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులను బట్టి చూస్తే.. కేవలం 10 దేశాల నుంచే అత్యధిక కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. గడిచిన 9 రోజుల్లో లక్షకు పైగా […]

పరిస్థితి మరింత దిగజారుతోంది.. కరోనాపై డబ్ల్యూహోచ్‌ఓ హెచ్చరిక
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 10:10 AM

కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి మరింత దిగజారుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ఆదివారం నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులను బట్టి చూస్తే.. కేవలం 10 దేశాల నుంచే అత్యధిక కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. గడిచిన 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆఫ్రికా దేశాల్లో వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని దేశాల్లో కేసులు వెయ్యికి తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ వైరస్ రోజు రోజుకు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది అని టెడ్రోస్ అన్నారు. అయితే కొన్ని దేశాల్లో వైరస్‌ ప్రభావం క్రమంగా తగ్గడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ దేశాల్లో కూడా ప్రజలు ఎంతమేర నిబంధనలకు కట్టుబడి ఉంటారన్నది సవాల్‌గా మారిందని ఆయన అన్నారు. ఇక చాలా దేశాల్లో సామూహిక నిరసనలు కొనసాగుతుండటం వలన ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తున్నారని.. దీని వలన వైరస్ వ్యాప్తి మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71,93,476కు చేరింది. వారిలో 4,08,614 మంది మృత్యువాతపడ్డారు.

Read This Story Also: అస్వస్థతకు గురైన ‘కరణం మల్లీశ్వరి’ దర్శకురాలు..!