కరోనా వైరస్ ఫ్రీ టెస్టింగ్.. డబ్బుల్లేని మెడికల్ సంస్థలకేదీ దారి ? నిపుణుల ఆందోళన

కరోనా వైరస్ నిర్ధారణకు ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్ లు ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు.. ఈ వైరస్ పై మనం జరిపే పోరాటానికి అవరోధంగా నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రైవేటు మెడికల్ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోలేక అల్లాడుతున్నాయని, ఎలాంటి ఆర్ధిక సాయం లేకుండా ఫ్రీగా టెస్టులు జరిపితే అవి మరింత నష్టాల్లో కూరుకుపోతాయని ఆరోగ్య నిపుణులు, బిజినెస్ లీడర్లు అంటున్నారు.మన దేశంలో అనేక సంస్థలు తగినంత ఆదాయం లేక సతమతమవుతున్న విషయాన్ని […]

కరోనా వైరస్ ఫ్రీ టెస్టింగ్.. డబ్బుల్లేని మెడికల్ సంస్థలకేదీ దారి ? నిపుణుల ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2020 | 6:23 PM

కరోనా వైరస్ నిర్ధారణకు ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్ లు ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు.. ఈ వైరస్ పై మనం జరిపే పోరాటానికి అవరోధంగా నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రైవేటు మెడికల్ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోలేక అల్లాడుతున్నాయని, ఎలాంటి ఆర్ధిక సాయం లేకుండా ఫ్రీగా టెస్టులు జరిపితే అవి మరింత నష్టాల్లో కూరుకుపోతాయని ఆరోగ్య నిపుణులు, బిజినెస్ లీడర్లు అంటున్నారు.మన దేశంలో అనేక సంస్థలు తగినంత ఆదాయం లేక సతమతమవుతున్న విషయాన్ని గమనించాలని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. ‘క్రెడిట్’ పై ఈ సంస్థలు పని చేస్తాయని భావించరాదని, మానవతా దృక్పథం అన్నది ముఖ్యమేగానీ.. ఇది ఆచరణ సాధ్యం కాదని షా అభిప్రాయపడ్డారు. ఈ టెస్టింగ్ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని అనుకోరాదని షా ట్వీట్ చేశారు. చాలావరకు ఇవి చిన్న మెడికల్ సంస్థలని , వీటికి పెద్దగా లాభాలు కూడా రావడంలేదని, అలాంటపుడు ఇవి తమ ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లిస్తాయని ప్రశ్నించారు.

కరోనా విజృభిస్తున్న ఈ విపత్కర సమయంలో ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ సంస్థలు ఉచిత కరోనా పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ విధానాలను విస్తృతం చేయాలన్న ఆలోచన మంచిదే గానీ.. ఇది ఒక విధంగా ముప్పుగానే పరిణమిస్తుందని హెల్త్ స్పెషలిస్ట్, ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి మాజీ సభ్యురాలు షమికా రవి వ్యాఖ్యానించారు. ఇండియాలో ఇప్పటికే ఎకానమీ ఒడిదుడుకులతో సాగుతోందని, దీంతో బాటు ఆరోగ్య రంగం కూడా నిధుల లేమితో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ఆమె పేర్కొన్నారు. ఈ స్థితిలో ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు ఉచితంగా కరోనా పరీక్షలను నిర్వహించే స్థితిలో లేవన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో