Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా..

Congress MP Komatireddy Venkat Reddy Sensational Comments On TPCC Chief Post, కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా..

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో పీసీసీ చీఫ్‌ మార్పులు జరుగబోతున్నాయన్నారు. మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీకి నూతన రథసారథి రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు.. పీసీసీ రేసులో అందరికంటే తానే ముందున్నానన్నారు. ఇక త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టీపీసీసీ పదవి నుంచి వైదొలగనున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా తనకే ఇస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నానని.. ఇందుకోసం అధిష్టానం అనుమతి కూడా కోరానన్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు.

Congress MP Komatireddy Venkat Reddy Sensational Comments On TPCC Chief Post, కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా..

ఇక ఇదిలా ఉంటే.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇటీవల తన మనసులో ఉన్న మాటను తెలిపారు. తాను కూడా టీపీసీసీ రేసులో ఉన్నానన్నారు.
తనకు టీపీసీసీగా అవకాశమిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అంతేకాదు.. ప్రజా క్షేత్రంలో సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. జగ్గారెడ్డితో పాటు.. మరికొందరు కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిసింది.

కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలతో అధిష్టానం కూడా వెంకట్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి రాదంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. తమకు పీసీసీ పగ్గాలు ఇస్తే.. పార్టీ సజీవంగా బతకడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగానే.. బీజేపీకే భవిష్యత్తు ఉందని.. త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకుని.. కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఆడిన ఈ గేమ్ అంతా అన్నకు పీసీసీ పదవి కోసమేనేమో అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.