హోమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు

Kaleshwaram project inauguration, హోమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు ఇవాళ మేడిగడ్డ వద్ద నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. మేడిగడ్డ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్.. జ్యోతిప్రజ్వలన చేసి హోమాన్ని ప్రారంభించారు. ఇక్కడ శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహిస్తున్నారు.

ఉదయం 10.30 గంటల సమయంలో గవర్నర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో నీటిని విడుదల చేయనున్నారు. ఈ చారిత్రాత్మక సన్నివేశంలో యావత్ తెలంగాణ ప్రజానీకం సంబురంగా పాలుపంచుకుంటున్నది. గ్రామగ్రామాన రైతులు, ప్రజలు వేడుకలకు సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *