గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ!

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో ఈ సాయంత్రం పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *