మన్మధుడు సినిమా హీరోయిన్.. ఆ స్టార్ట్ హీరో‌కు తల్లిగా రీ ఎంట్రీ !!

Phani.ch

10 May 2024

ఒక్కప్పుడు స్టార్ హీరోలు పక్కన చేసిన హీరోయిన్స్ ఇప్పుడు తల్లలుగా నటిస్తున్నారు.. వారిలో రమ్యకృష్ణ, రాధికా, ఆమని చేస్తుండగా తాజాగా  ఈ  లిస్ట్ లోకి ప్రభాస్ హీరోయిన్ కూడా చేరింది.

అన్షు.. ఈ పేరు చాలా మందికి తెలికపోవచ్చు కానీ మన్మధుడు సినిమా పేరు చెప్పగానే టక్కున గుర్తువస్తుంది తెలుగు ప్రేక్షకులకు.

నాగార్జున మన్మథుడు చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు అన్షు కూడా కీలక పాత్రలో నటించింది.

తరువాత ప్రభాస్‌తో రాఘవేంద్రలో నటించింది. ఆ తర్వాత ఓ నాలుగైదు సినిమాల్లో నటిచిన ఈబ్యూటీ ఆతరువా సినిమాలకు గుడ్ బై చెప్పింది.

ఇది ఇలా ఉంటే తాజా సమాచారం ప్రకారం అన్షు తెలుగు సినిమాలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

తెలుగులోసందీప్ కిషన్ హీరోగా, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో  SK30 పేరుతో వస్తున్న ఈ చిత్రంలో అన్షు ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ షాకింగ్ విషయం ఏంటీ అంటే.. ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సందీప్ కిషన్ తల్లిగా నటిస్తోందని తెలుస్తోంది.