ఏపీ పాలిటిక్స్.. అన్నాదమ్ముల మధ్య ‘మెగా చిచ్చు’..!

మెగా ఫ్యామిలీలో మళ్లీ బీటలు వచ్చాయా..? అన్నాదమ్ముల మధ్య అసలేం జరుగుతోంది..? తాము ఎప్పటికైనా ఒకటేనంటూ బయటకు చెప్తున్న మెగా ఫ్యామిలీ మాటల్లో వాస్తవమెంత..? అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలో తొలుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో మారుతున్న రాజకీయాలు మెగాస్టార్, పవర్‌స్టార్ మధ్య చిచ్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు రాజకీయాల్లో ఉన్న తమ్ముడు.. జగన్, ఏపీ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తుంటే… మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న అన్నయ్య […]

ఏపీ పాలిటిక్స్.. అన్నాదమ్ముల మధ్య 'మెగా చిచ్చు'..!
Follow us

| Edited By:

Updated on: Dec 21, 2019 | 8:03 PM

మెగా ఫ్యామిలీలో మళ్లీ బీటలు వచ్చాయా..? అన్నాదమ్ముల మధ్య అసలేం జరుగుతోంది..? తాము ఎప్పటికైనా ఒకటేనంటూ బయటకు చెప్తున్న మెగా ఫ్యామిలీ మాటల్లో వాస్తవమెంత..? అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలో తొలుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో మారుతున్న రాజకీయాలు మెగాస్టార్, పవర్‌స్టార్ మధ్య చిచ్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు రాజకీయాల్లో ఉన్న తమ్ముడు.. జగన్, ఏపీ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తుంటే… మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న అన్నయ్య మాత్రం భిన్న స్వరాన్ని వినిపిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఏపీ రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు చిరంజీవి.

అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనన్న ఆయన.. దీని వలన భవిష్యత్‌లో అయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు ఈ నిర్ణయాన్ని జనసేన అధినేత, చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ మొదట ఖండించారు. రాజధాని ప్రాంత ప్రజలకు జగన్ అన్యాయం చేస్తున్నారని సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడేమో కాస్త యూటర్న్ తీసుకొని మంత్రి మండలి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ పవన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయంలోనే కాదు.. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెగాస్టార్, పవర్‌స్టార్ మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌లో సతీసమేతంగా సీఎం జగన్ ఇంటికి వెళ్లిన చిరు.. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు బావున్నాయని.. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ధీమా తనకు ఉందని కామెంట్లు చేశారు. అంతేకాదు ఈ మధ్యన జగన్ దిశ చట్టం తీసుకురావడంపై కూడా మెగాస్టార్ అభినందనలు తెలిపారు. జగన్ వేసిన అడుగు గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మరోవైపు దిశ చట్టానికి పవన్ కాస్త మద్ధతు ఇస్తూనే.. ఉన్న చట్టాలను సరిగ్గా అమలు చేయకుండా, కొత్త చట్టాలంటే ఉపయోగం ఏముంటుందని కౌంటర్ ఇచ్చారు. ఇలా జగన్‌పై అన్నయ్య ఒకలా, తమ్ముడు మరోలా స్పందిస్తుండటంతో మెగా ఫ్యామిలీలో అసలేం జరుగుతుందన్న చర్చ ఇటు టాలీవుడ్‌, అటు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి అన్నదమ్ముల భిన్న స్వరాల వెనుక అసలు రీజన్ ఏంటో…? ఆ పెరుమాళ్లకే ఎరుక.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో