Breaking News
  • తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి. తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈశాన్య ఝార్ఖండ్, ఒరిస్సా మీదుగా 1.5 కి.మీ 5.8 కి.మీ ఎత్తు మధ్య ఏర్పడిన మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు. ఈరోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, నారాయణ పేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం.
  • కడప: ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల ఫోర్జరీ కేసు. నిందితుడు సుబ్రమణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొందరిని ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు.
  • టీవీ9తో హేమంత్‌ సోదరుడు. మా అన్నకు జరిగిన అన్యాయం మరొకరికి మళ్లీ జరగొద్దు. పెళ్లైనప్పటినుంచీ వదిన బంధువులు బెదిరిస్తూనే ఉన్నారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా నిందితులు బెదిరింపులకు దిగారు. వాళ్లే మారతారు, వదిలేద్దాం అని అవంతి చెబుతూ వచ్చింది. చిత్రహింసలు పెట్టి అవంతి కుటుంబసభ్యులు దారుణంగా చంపారు. హత్యకేసు నిందితుల నోటితోనే మీడియాకు నిజాలు చెప్పించాలి. కాలయాపన లేకుండా మా కుటుంబానికి తక్షణ న్యాయం జరగాలి. -టీవీ9తో హేమంత్‌ సోదరుడు.
  • ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన దీపికాపదుకొనె. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో దీపికా విచారణ. కరీష్మా, దీపికా చాటింగ్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం. కరీష్మాతో పరిచయం, డ్రగ్స్‌ సప్లయ్‌పై 4 గంటలుగా విచారణ. పల్లార్డ్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో శ్రద్ధా, సారా విచారణ. త్వరలో కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేసే అవకాశం.
  • మంచిర్యాల: బెల్లంపల్లిలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. అదనపు కట్నం కోసం భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త మధుకర్‌. గతేడాది ఫిబ్రవరిలో మధుకర్‌తో విజయ వివాహం. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులు. అత్తింటివారితో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.
  • గుంటూరు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారికి గాయం. తెనాలిలోని తన ఇంట్లో కాలుజారిపడ్డ నన్నపనేని. నన్నపనేని రాజకుమారి తలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

చైనా మరో కీలక నిర్ణయం.. న్యూజీలాండ్ తో ఒప్పందం రద్దు

కరోనా మహమ్మారిని ప్రపంచానికి అంటగట్ఠిన చైనా అన్ని దేశాలతో సత్సంబంధాలకు దూరమవుతోంది. మరోవైపు డ్రాగన్ కంట్రీ వివిధ దేశాలపై ప్రతీకార చర్యలకు తెగబడుతోంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చైనా అనేక ఒప్పందాలను రద్దు చేసుకున్న మరో దేశాన్ని కూడా తెగతెంపులు చేసుకుంటోంది.

China suspends HKSAR extradition and judiciary assistance treaties with New Zealand, చైనా మరో కీలక నిర్ణయం.. న్యూజీలాండ్ తో ఒప్పందం రద్దు

కరోనా మహమ్మారిని ప్రపంచానికి అంటగట్ఠిన చైనా అన్ని దేశాలతో సత్సంబంధాలకు దూరమవుతోంది. మరోవైపు డ్రాగన్ కంట్రీ వివిధ దేశాలపై ప్రతీకార చర్యలకు తెగబడుతోంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చైనా అనేక ఒప్పందాలను రద్దు చేసుకున్న మరో దేశాన్ని కూడా తెగతెంపులు చేసుకుంటోంది. తాజాగా న్యూజీలాండ్ తో కూడా ఓ కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకుంది చైనా. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. ‘నేరస్థులను, దేశం నుంచి పారిపోయి వచ్చినవారిని తిరిగి అప్పగించడానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఇన్నాళ్లుగా ఉన్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు వాంగ్ బిన్ ప్రకటించారు. హాంకాంగ్ లో చైనా కొత్త రక్షణ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈమేరుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదివరకే హాంకాంగ్ తో న్యూజీలాండ్ ఇదే ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో చైనా కూడా ఈ నిర్ణయం తీసుకుందని వాంగ్ తెలిపారు.

Related Tags