Breaking News
  • కర్నూలు: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం. మహిళకు ఆపరేషన్‌ చేసి కడుపులో దూదిని మర్చిపోయిన డాక్టర్లు. డాక్టర్ల తీరుపై బాధిత బంధువుల ఆందోళన.
  • హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష. ఎమ్మార్పీఎస్‌ మహాదీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ. నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మందకృష్ణ అరెస్ట్‌. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్‌.
  • వనపర్తి: పెబ్బేరు బైపాస్‌లో ఆటోను ఢీకొన్న కారు. ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • తూ.గో: కాకినాడలో అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష. విషజ్వరాలు అధికంగా ఉన్న చోట స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపట్టాలి. ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరతను త్వరలో పరిష్కరిస్తాం. తూ.గో.జిల్లాలో రూ.250 కోట్లతో మంచినీటి పథకం అమలుచేస్తాం. అర్హులందరికీ త్వరలో ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తాం-మంత్రి కన్నబాబు.
  • హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష. ఎమ్మార్పీఎస్‌ మహాదీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ. నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మందకృష్ణ అరెస్ట్‌. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్‌.
  • కరీంనగర్‌: కలెక్టర్‌ ఆడియో టేపుల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌. వివరాలు సేకరిస్తున్న సీఎంఓ అధికారులు. ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌.
  • ఉత్తరాఖండ్: సాయంత్రం బద్రీనాథ్‌ ఆలయం మూసివేత. చివరిరోజు కావడంతో భారీగా దర్శించుకుంటున్న భక్తులు.

ఆపరేషన్ చిత్తూరు.. చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి?

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీలో యాక్టివిటీస్‌ బాగా తగ్గాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో.. ఎక్కడా పార్టీలో హడావుడి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కేడర్‌కు అందుబాటులో లేకుండా పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుప్పం నుంచి టీడీపీ తరపున చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగతా ఎవ్వరూ గెలవలేదు. చంద్రబాబు జిల్లాపై ఫోకస్‌ పెట్టకపోవడంతో నేతలు యాక్టివిటీ తగ్గించారు. ఇటు కేడర్‌ కూడా డల్‌ అయిపోయింది.

తిరుపతి నుంచి పోటీ చేసిన సుగుణమ్మ.. నగరిలో భాను ప్రకాష్‌  పార్టీ కార్యక్రమాల్లో తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. అటు శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసిన బొజ్జల సుధీర్‌ హైదరాబాద్‌కు పరిమితం కాగా.. చంద్రగిరి అభ్యర్థి పులి నాని నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయన్ని జిల్లా బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీలోనే కొందరు నేతలు కోరుతున్నారు. ఇలా పార్టీలోని అందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు.. తప్పితే కేడర్‌ను మాత్రం కలవడం లేదు. వైసీపీ దూకుడుకు కేడర్ మొత్తం చెల్లాచెదురవుతోంది. వారిని ఒకతాటిపై నడిపించే నేత లేకపోవడం ఇప్పుడు లోటుగా మారింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే నెలలో జిల్లా పర్యటనకు రానున్నారు. ఇక జిల్లా కేడర్‌కు భరోసా ఇచ్చే నేతను కూడా ఈ మీటింగ్‌లో ఎంపిక చేస్తారని తెలుస్తోంది.