Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా .. ఈసారి ఎవరంటే ?

chalasani raises special status issue, మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా .. ఈసారి ఎవరంటే ?

ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదికొస్తోంది. ఎన్నికలకు ముందు అప్పటి పాలక, ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా అంశాన్ని పలు దఫాలుగా, వివిధ రకాలు ప్రస్తావించాయి. ఎన్నికలు ముగిసాక వారు వీరయ్యారు.. వీరు వారయ్యారు. ప్రతిపక్ష నేతగా వున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర పీఠాన్ని అధిరోహించారు. అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమై పార్టీ నేతలను రక్షించుకునే పనిలో పడ్డారు.

ఎన్నికలు ముగిసిన దాదాపు 5 నెలలు కావస్తోంది. అటు ప్రతిపక్షంగానీ.. ఇటు అధికార పక్షంగానీ ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదు. ప్రత్యేక హోదాపై అప్పట్లో ఊదరగొట్టిన ఓ సినీ నటుడైతే ఇటు అతాపతా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో మొదట్నించి తెలుగు భాష కోసం.. తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఉద్యమాలకు ఊపిరి పోసిన ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాదన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మరోసారి ప్రత్యేక హోదాపై గళం విప్పారు.

chalasani raises special status issue, మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా .. ఈసారి ఎవరంటే ?

ముఖ్య మంత్రి, ప్రతి పక్ష నాయకులు ఎందుకు విభజన హామీలు కోసం పోరాటం చేయడం లేదని చలసాని ప్రశ్నించారు. కేంద్రం పై విరోధం పెట్టుకోమని చెప్పడంలేదు.. కానీ హామీలు అమలు కాకపోతే రూపాయి కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమలకు రావన్న అంశాన్ని రాజకీయ నేతలు గుర్తించాలని ఆయనన్నారు. విశాఖలో మంగళవారం నాడు మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రబ్యాంకు లేకుండా చేస్తున్న కేంద్రంపై ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మిగతా రాష్ట్రాల తరహాలో జెఈఈ పరీక్షలు తెలుగులో కూడా రాసే అవకాశమివ్వాలని, ఈ అంశాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు గట్టి స్వరంతో వినిపించాలని ఆయనంటున్నారు.

 

Related Tags