బయోకాన్ డ్రగ్ కి చుక్కెదురు..’నో’ చెప్పిన కేంద్రం

కోవిడ్-19 రోగుల చికిత్సలో ఉపయోగపడుతుందంటూ బయోకాన్ కంపెనీ  ఉత్పత్తి చేసిన 'ఐటోలిజుమాబ్'...మందుకు కేంద్రం నుంచి చుక్కెదురైంది.   నేషనల్ ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ లో దీన్ని చేర్చలేదని..

బయోకాన్ డ్రగ్ కి చుక్కెదురు..'నో' చెప్పిన కేంద్రం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 3:14 PM

కోవిడ్-19 రోగుల చికిత్సలో ఉపయోగపడుతుందంటూ బయోకాన్ కంపెనీ  ఉత్పత్తి చేసిన ‘ఐటోలిజుమాబ్’…మందుకు కేంద్రం నుంచి చుక్కెదురైంది.   నేషనల్ ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ లో దీన్ని చేర్చలేదని ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధారణ స్థాయి నుంచి విషమ స్థితిలో ఉన్న కరోనా వైరస్ రోగులకు ఈ మెడిసిన్ ని వినియోగించేందుకు రెండు వారాల క్రితమే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ సంస్థను అనుమతించింది. కానీ ఈ మందుకు అనుకూలమైన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయని కోవిడ్ పై తాము ఏర్పాటు చేసిన  జాతీయ నిపుణుల బృందం అభిప్రాయపడిందని హెల్త్ మినిస్ట్రీ ఓ నోట్ లో తెలిపింది. ట్రయల్ కోసం కేవలం 30 మంది వలంటీర్లను బయోకాన్ వినియోగించిందని పలువురు ఇతర నిపుణులు కూడా పేర్కొన్నారు. కాగా-సోరియాసిస్ వ్యాధికి చికిత్స కోసం ఈ మెడిసిన్ ని గతంలోనే అనుమతించారని, దీన్ని కోవిడ్ రోగులకు కూడా వాడవచ్చునని బయోకాన్ వివరించింది. రోగులకు అత్యవసర సమయాల్లో వాడాలన్న తమ ప్రొసీజర్ కూడా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఉందని వెల్లడించింది. ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల బృందం కోరితే మేము మరిన్ని ఆధారాలను సమర్పిస్తాం.. ప్రోటోకాల్ లో ఈ మెడిసిన్ ని చేర్చే విషయమై పునరాలోచించండి అని బయోకాన్ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా దీన్ని వెయ్యిమంది రోగులకు వాడినట్టు తెలిపింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో