బ్రేకింగ్: బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!

CBI Focus On Bjp Mp Sujana Chowdary, బ్రేకింగ్: బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!

అమరావతి రాజధాని భూముల వివాదం కొత్త మలుపు తీసుకోబోతోందా ? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా ఇబ్బందుల్లో పడబోతున్నారా ? ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే కోణంలో అధికారులు సీరియస్‌గా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలంలోని పలు గ్రామాల పరిధిలో పర్యటించిన అధికారులు బినామీ భూములపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. మొగులూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు వంటి గ్రామాల్లో తిరిగిన రెవిన్యూ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు గ్రామస్తులను, రైతులను అడిగి భూముల వివరాలు సేకరించారు. రాజధాని ప్రాంతంలో గత కొన్నేళ్లుగా భూములు ఎవరెవరికి అమ్మారు, ఎవరెవరి పేరు మీద కొనుగోళ్లు జరిగాయనే అనే కోణంలో అధికారులు విచారణ యేపట్టారు. ఇటీవల అమరావతి భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని ప్రకటించిన సందర్భంలో అమరావతి ప్రాంతంలో తనకు భూములు లేవని, ఒక్క ఎకరం బినామీల పేరుతో ఉన్నా బయటపెట్టండి అని ..సుజనా చౌదరి మంత్రి బొత్సకు సవాల్ చేశారు. ఈ సవాల్‌కు స్పందించిన మంత్రి బొత్స రాజధాని ప్రాంతంలో మొత్తం 600కు పైగా ఎకరాలు బంధువులు, బినామీల పేర్లతో సుజనా చౌదరి కొనుగోలు చేశారని లెక్కలతో సహా బయటపెట్టారు. అంతే కాదు కంచికచర్ల మండల పరిధిలో సుజనాకు వందలాది ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. బొత్స వివరాలు వెల్లడించే వరకు ధీటుగా స్పందించిన సుజనా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. తాజాగా అధికారులు కంచికచర్ల ప్రాంతంలో అధికారులు విచారణ చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం, అమరావతి రాజధాని ప్రకటనకు ముందు, ఆ తర్వాత అక్కడి భూములు ఎవరి పేర ఉన్నాయి… ఎవరెవరి చేతులు మారాయి… ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఎవరి పేరున ఉన్నాయి.. అనే వివరాలు ఆరా తీస్తున్నారట. దీంతో అమరావతి భూముల వివాదంలో సుజనాచౌదరి చుట్టూ ఉచ్చు బిగిసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సుజనా అనవసరంగా ప్రభుత్వంపై సవాళ్లు చేసి ఇరుక్కుపోయారని టీడీపీ, బీజేపీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బినామీలపై ఫోకస్ పెట్టడం రాజకీయంగా పలువురు ప్రముఖ నేతలకు ఇబ్బంది కరంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి సుజనా వంటి నేతలు, ఆంధ్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన మరి కొందరు నేతలు ఈ ల్యాండ్ స్కామ్‌లో ఇరుక్కుపోతారా ? అన్నది త్వరలోనే తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *