UPSC Recruitment 2024: డిగ్రీ అర్హతతో 312 కేంద్ర కొలువులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Jun 03, 2024 | 2:46 PM

దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర విభాగాలు, పరిపాలన శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వంటి తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌..

UPSC Recruitment 2024: డిగ్రీ అర్హతతో 312 కేంద్ర కొలువులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
UPSC
Follow us on

దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర విభాగాలు, పరిపాలన శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వంటి తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ అర్హతతతో ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.25 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు జూన్‌ 13, 2024వ తేదీ తుది గడువు.

పోస్టుల వివరాలు

  • డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్ పోస్టులు: 4
  • డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ పోస్టులు: 67
  • సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టులు: 4
  • స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 132
  • స్పెషలిస్ట్ గ్రేడ్-III పోస్టులు: 35
  • డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు: 9
  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 4
  • అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II పోస్టులు: 46
  • ఇంజినీర్ & షిప్ సర్వేయర్‌ కం-డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్టులు: 2
  • ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు: 8
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 1

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇతర పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.