UPSC NDA/NA 2026-II నోటిఫికేషన్ విడుదల: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి మార్గం

UPSC NDA NA 2026-II Notification: త్రివిధ దళాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి రెండో విడత UPSC NDA/NA 2026-II నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది..

UPSC NDA/NA 2026-II నోటిఫికేషన్ విడుదల: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి మార్గం
UPSC NDA NA Notification

Updated on: May 22, 2026 | 11:34 AM

యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (2) (UPSC NDANA 2026) నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో జులై 1, 2027 నుంచి ప్రారంభమయ్యే 158వ కోర్సు, 120వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 394 పోస్టులు ఉన్నాయి. ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి డిఫెన్స్, నావల్‌, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జూన్‌ 9, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు..

ఖాళీల వివరాలు..

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో పోస్టుల సంఖ్య: 370

  • ఆర్మీ వింగ్‌లో పోస్టులు: 208 ( పురుషులు 198, మహిళలు 10)
  • నేవీ వింగ్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌)లో పోస్టులు: 42 (పురుషులు 37 , మహిళలు 5)

ఎయిర్ ఫోర్స్ వింగ్ లో పోస్టుల సంఖ్య: 120

  • ఫ్లయింగ్ బ్రాంచ్: 92 (మహిళలకు 02 సహా)
  • గ్రౌండ్ డ్యూటీలు (టెక్): 18 (మహిళలకు 02 సహా)
  • గ్రౌండ్ డ్యూటీలు (నాన్-టెక్): 10 (మహిళలకు 02 సహా)

నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)లో పోస్టుల సంఖ్య: 24 (పురుషులు 21, మహిళలు 3)

ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి అభ్యర్థులు జనవరి 1, 2008కి ముందు జనవరి 1, 2011కి తర్వాత పుట్టి ఉండకూడదు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్ 9, 2026వ తేదీలోపు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక‌వుతారు. వీరు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చ‌దివే అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం

రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లకు మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్ 1లో మ్యాథమేటిక్స్- 300 మార్కులకు రెండున్నర గంటల వ్యవధిలో ఉంటుంది. పేపర్ 2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులకు రెండున్నర గంటల వ్యవధిలో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు 900 మార్కులకు ఉంటాయి. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్‌ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 9, 2029.
  • రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 13, 2026.
  • కోర్సు ప్రారంభం: జులై 1, 2027 నుంచి

యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (II)-2026 ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us