యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతీయేట మాదిరిగానే ఈ సారి కూడా ‘కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2025’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఏడాది మొత్తం 85 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సెప్టెంబర్ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు పోస్టును బట్టి జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ స్పెషలైజేఫషన్‌లో మాస్టర్ డిగ్రీ, ఎంఎస్సీ(టెక్)- అప్లైడ్ జియోఫిజిక్స్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి కింద జనవరి 1, 2025 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 24, 2024వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద రూ.200 ప్రతి ఒక్కరూ చెల్లిచవల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుల సవరణకు సెప్టెంబర్ 25, 2024 నుంచి అక్టోబర్ 1, 2024 వరకు అవకాశం ఇస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 09, 2025న జరుగుతుంది. మెయిన్ పరీక్ష జూన్ 21, 22 తేదీల్లో జరుగుతాయి. స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.