
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2027 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (CGWB)లో గ్రూప్ A, గ్రూప్ B పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 127 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 22, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు..
పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. జియాలజీ, అప్లైడ్ జియాలజీ, జియోఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, హైడ్రోజియాలజీ తదితర సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2027 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 22, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష – ఆబ్జెక్టివ్ టైప్, 400 మార్కులు, మెయిన్స్ పరీక్ష – డిస్క్రిప్టివ్/రాత పరీక్ష, 600 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ – 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు 1/3 వంతు చొప్పున కోత విధిస్తారు.